Sunday, December 22, 2024

‘తండేల్’లో నాగ చైతన్య లుక్ అదుర్స్.. ప్రచార వీడియో రిలీజ్

- Advertisement -
- Advertisement -

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ ప్రచార వీడియో ఆకట్టుకునేలా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ప్రచార వీడియోను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో  నాగ చైతన్య జాలరిగా నటించారు. చేపలు పడుతూ సముద్రంలో దారి తప్పి, పాకిస్తాన్ సైనికులకు హీరో దొరికిపోతాడు. ఇక్కడ అతనికోసం హీరోయిన్ ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ సన్నివేశాలపై రూపొందిన ప్రచార వీడియో ఆసక్తికరంగా ఉంది. కాస్త యాక్షన్ ను, మరికాస్త దేశభక్తిని మేళవించి సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచార వీడియోను బట్టి తెలుస్తోంది.

తండేల్ మూవీకి శ్రీకాకుళం సమీపాన జరిగిన ఒక సంఘటన ఆధారమని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర యాసలో నాగచైతన్య పలికిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News