మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త గా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కొత్త పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త పంచాయతీల ఏ ర్పాటుతో తెలంగాణలో పంచాయతీల సంఖ్య 12, 991కు చేరింది. ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలు ఉండేవి. కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అలాగే ఒక పంచాయతీని మున్సిపాల్టీగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 12,991కు చేరింది.
మున్సిపాలిటీగా ములుగు
ములుగు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పంచాయతీల ఏర్పాటుతోపాటు ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోదించాయి. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.