Saturday, December 28, 2024

గ్రూపు1 ప్రిలిమినరీకి 106 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు: అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రూపు1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని శంకర్‌జీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 51,851 మంది అభ్యర్థులు ఈపరీక్షకు హాజరు కానున్నారన్నారు.

ఈ పరీక్షకు 29 రూట్లలో 29 మంది రూట్ ఆఫీసర్లను, 106మంది అసిస్టెంట్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జీరాక్స్ షాపులను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షను అమలవుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటి, టాయిలెట్లు, త్రాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అంతరాయం కలగకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఓఎంఆర్ షీట్ పైన బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలన్నారు. అన్ని చీప్ సూపరింటెండెంట్లు రూమ్స్‌లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు గ్రౌండ్ ప్లోర్‌లోనే వారికి సీటు కేటాయించాలన్నారు. ప్రవేశద్వారం వద్ద బయోమెట్రిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా, పురుష అభ్యర్థులకు వేరువేరుగా ప్రవేశ ద్వారం వద్దనే తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.

మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసినట్లు, అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలలోనికి ఉదయం 8.30గంటల నుండి 10.15 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూప్ తమ వెంట తీసుకురావాలన్నారు. అభ్యర్ధులు బూట్లతో కాకుండా చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, మొబైల్ పోన్లు, క్యాలికులెటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, అదనపు పరీక్ష కేంద్రాలకు అనుమతించరని తెలిపారు.ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ సూర్యలత, అదనపు డిసిసి బాపూరావు, ఆర్టిసీ ప్రాంతీయ మేనేజర్ వెంకన్న, ఎలక్ట్రిసిటి డిపార్టుమెంట్ నుంచి ప్రార్ధన, మెట్రో వాటర్ వర్క్ నుంచి స్వామి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ, అన్ని పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, తహాసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News