- Advertisement -
బిసి విద్యార్థుల కోసం సిఎం కెసిఆర్ కృషి
మంత్రి గంగుల కమలాకర్
మనతెలంగాణ/హైదరాబాద్ : నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 నియోజకవర్గాల్లో బిసి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే అసలైన వారసుడు సిఎం కెసిఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహాత్యా జ్యోతిరావు ఫూలే జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్షంతో సిఎం కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సామాజిక అసమానతల మీద జ్యోతిరావు ఫూలే అలుపెరగని పోరాటం చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఫూలే చేసిన కృషి చాలా గొప్పదన్నారు.
- Advertisement -