Saturday, December 21, 2024

రాష్ట్రంలో 12 సిఎంఎస్‌ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Establishment of Central Medicine Stores at 12 places in Telangana

ప్రభుత్వాస్పత్రులు బలోపేతం
ఔట్ సోర్సింగ్‌తో సిబ్బంది
నియామకం వైద్యారోగ్య
శాఖ ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) ఏర్పాటుకు చేయనుంది. సిఎంఎస్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో స్టోర్‌కు రూ. 3.60 కోట్ల చొప్పున మొత్తం రూ. 43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ స్టోర్స్‌లో పని చేసేందుకు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 12 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 మంది ప్యాకర్లు, 12 మంది వాచ్‌మెన్లను నియమించుకునేందుకు టిఎస్‌ఎంఎస్‌ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్‌కు అనుమతిచ్చారు. ఈ 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ అందుబాటులోకి వస్తే రోగులకు వెంటనే మందులు అందనున్నాయి.

సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఇవే..
1. సిద్దిపేట(టీచింగ్ హాస్పిటల్)
2. వనపర్తి (జిల్లా ఆస్పత్రి)
3. మహబూబాబాద్ (జిల్లా ఆస్పత్రి)
4. జగిత్యాల (జిల్లా ఆస్పత్రి)
5. మంచిర్యాల (జిల్లా ఆస్పత్రి)
6. భూపాలపల్లి (జిల్లా ఆస్పత్రి)
7. కొత్తగూడెం (జిల్లా ఆస్పత్రి)
8. నాగర్ కర్నూల్ (జిల్లా ఆస్పత్రి)
9. సూర్యాపేట (టీచింగ్ హాస్పిటల్)
10. భువనగిరి (జిల్లా ఆస్పత్రి)
11. వికారాబాద్ (ఏరియా హాస్పిటల్)
12. గద్వాల (జిల్లా ఆస్పత్రి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News