Monday, December 23, 2024

జిల్లా నూతన మత్స పారిశ్రామిక సంఘం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం తండా రైతు వేదికలో జి ల్లా మత్సశాఖ అధి కారి ఎస్‌ఏ రెహమాన్ సమక్షంలో బుధవార ం జిల్లా మత్స పారిశ్రామిక సంఘం అడాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆడక్ కమిటీ చీఫ్ ప్రమోటర్‌గా పుట్ట బాలరాజును ఆత్మకూరు మండలం, ఆనెమొని కృష్ణయ్య ఘనపూర్ మండలం, చెంది శేఖర్ పానుగల్ మండలం, బొలెద్దుల బాలరాజు గోపాల్‌పేట మండలం, వుందే కోటి నాగేంద్రం పెద్దమందడి మం డలం, బోలెమోని కృష్ణయ్య వనపర్తి మండలం, చొప్పరి బీచ్పల్లి పెబ్బేరు మండలం, సింగనమోని మనో హర్ శ్రీరంగాపురం మండలం, తెప్ప కాశన్న రేవల్లి మండలం, సంద రంగస్వామి కొత్తకోట మండలం, మేకల సురేంద్రబాబు వీపనగండ్ల మండలం ఎన్నుకోవడం జరిగింది.

నూతన ంగా ఎన్నుకోబడిన జిల్లా మత్స సంఘం అడాక్ కమిటీ వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల చీఫ్ ప్రమోట ర్లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ కాగితాల లక్ష్మినారాయణ, జిల్లా ముదిరాజ్ సంఘం యువజన నాయకులు వాకిటి నారాయణ, వివిధ గ్రామాల మత్స సంఘ అధ్యక్షులు, మత్స శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News