Monday, December 23, 2024

ఎమ్మెల్యే చొరవతో మంచినీటి బోరు ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : మండల పరిధిలోని సీతారాంపురం పంచాయతీ అనంతారం తండాలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ చొరవతో మండల పరిషత్ నిధుల నుండి ఎంపీపీ మాళోత్ శకుంతలా కిషోర్ గ్రామంలో నీటి సమస్య ఉండడంతో బోరు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శకుంతలా కిషోర్, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమా శంకర్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు లు కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ మంచినీటి సమస్యను తీర్చడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్ కు, తన పరిధిలోని నిధులను కేటాయించిన ఎంపీపీ మాళోత్ శకుంతలా కిషోర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, కారేపల్లి వెంకటేశ్వర స్వామి సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, మండల కో ఆప్షన్ ఎండి హనీఫ్, స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News