మదనపురం : నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు చేసి యువత కు ఉపాధి కల్పించడమే తమ లక్షమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశానుసారం మండలంలోని దుప్పల్లి గ్రామంలో టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని ఆయన జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 25 0 ఎకరాల్లో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేసేందు కోసం నియోజకవర్గంలోని మూసాపేట్, భూత్పూర్, కర్వేన, మదనపురం మండలంలో అనువైన స్థలాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుఐ సాధ్యసాధ్యాలను ప్రభుత్వానికి నివేదించి అందించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. నియోజకవర్గ యువతీ యువకులకు ఉ పాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్న సిఎం కెసిఆర్, మ్ంర తి కెటిఆర్‌కు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ టెక్స్‌టైల్స్ మొహర్ పరెక్, కిటెక్స్ ప్రతినిధులు మనో జ్, తహసిల్దార్ నరేందర్, జెడ్పిటిసి సభ్యులు కృష్ణయ్య యాదవ్, మాజీ మార్కెట్ చైర్మెన్ వెంకట్ నారాయన; మాజీ మార్కెట్ వైస్ చైర్మెన్ వెంకట్రాములు యాదవ్, బిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, గ్రామ సర్పంచ్ శివ శంకర్, మండల నాయకులు ఆవుల బాలకృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.