శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో అధునాతన సౌకర్యాలతో స్పోర్ట్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసే క్రీడా సముదాయం కోసం ప్రభుత్వం ఇప్పటికే 20 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు క్రీడా శాఖకు శుక్రవారం అధికారులు అందజేశారని చైర్మన్ వివరించారు. వచ్చే నెలలో క్రీడా హబ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రి హరీష్ చేతుల మీదుగా క్రీడా సముద నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందన్నారు. అంతేగాక ఫిబ్రవరి 16 నుంచి గజ్వేల్‌లో ఫుట్‌బాల్ నిర్వహిస్తామని చైర్మన్ వెల్లడించారు. ఇదిలావుండగా స్పోర్ట్ హబ్ కోసం కేటాయించిన భూమిని శాట్స్ చైర్మన్ శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటెరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.