Friday, November 22, 2024

రాచకొండలో ‘వికల్ప్’ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ అన్నారు. రాచకొండ పోలీసులు, ప్రజ్వల సహకారంతో మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వికల్ప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీకుమార్ మాట్లాడుతూ నేరరహిత సమాజం కోసం కౌన్సెలింగ్ కేంద్రాన్ని రాచకొండ పోలీసులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంతో ప్రజ్వల సంస్థ ముందు ఉందని అన్నారు.

వికల్ప్ కేంద్రం ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇలాంటి కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఏర్పడతాయని, వాటిని అధిగమించి ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. నేర రహిత సమాజాన్ని నిర్మించడంతో వికల్ప్ కేంద్రం ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లలో మార్పు సమాజంలో గొప్ప మార్పు తీసుకుని వస్తుందని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు సమాజంలో భాగమని, వారికి అందరూ అండగా నిలవాలని కోరారు.

సమ్మిళిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని, సమస్యలకు మూలకారణం గుర్తించడమే అసలైన పరిష్కారమని అన్నారు. వికల్ప్ కేంద్రం ద్వారా ట్రాన్స్‌జెండర్ల సమస్యలకు అవసరమైన కౌన్సెలింగ్ అందిస్తామని, వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. వికల్ప్ ఏర్పాటు ద్వారా సమాజంలో నేర శాతం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News