Sunday, November 17, 2024

వార్ మెమోరియల్ పార్కు ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
దక్షిణ కొరియా పర్యటనలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్,గంగుల,వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్:  యుద్ధం పట్ల నేటి యువతలో అవగాహన, ఆసక్తి, నాలెడ్జి, దేశభక్తి నీ పెంపొందించడానికి కొరియా తరహాలో సిఎం కెసిఆర్ భారత ఆర్మూడ్ ఫోర్స్ సహకారంతో రాష్ట్రంలో అతిపెద్ద వార్ మోమెరియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో కొరియన్ వార్‌లో త్రివిధ దళాలు వాడిన వార్ మెమోరియల్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొరియన్ త్రివిధ దళాలు ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, సబ్ మెరైన్లు లతో కూడిన వార్ మెమోరియల్ పార్క్ తరహాలో తెలంగాణలో భారత త్రివిధ దళాల సహకారంతో అతిపెద్ద వార్ మెమోరియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేయడానికి సీయోల్ నగరంలో పర్యటించినట్లు చెప్పారు. సియోల్ నగరంలో గత కొరియన్ వార్ లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, సబ్ మెరైన్లు, త్రివిధ దళాలకు చెందిన ఆర్మ్‌లతో ఏర్పాటు చేసిన పార్కు ను పరిశీలించినట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో కొరియా తరహాలో ఏర్పాటు చేసే వార్ మెమోరియల్ పార్కు ద్వారా నేటి యువత లో యుద్ధం పట్ల అవగాహన, ఆసక్తి, ధైర్యం,దేశం పై అభిమానం, దేశభక్తి పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ పర్యటనలో పర్యాటక శాఖ ఎండి మనోహర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News