Monday, December 23, 2024

ప్రభుత్వ అప్పుల అంచనా రూ.15.4 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో సెక్యూరిటీల నుంచి ప్రభుత్వం రూ.15.4 లక్షల కోట్లు అప్పు చేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దేశీయ ఆర్థిక వ్యయ అవసరాలను తీర్చేందుకు గాను ఈ రుణాలు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 2023 మార్చి ముగింపు నాటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం అప్పులు రూ.14.21 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి పెరిగాయి. సెక్యూరిటీల నుంచి నికర మార్కెట్ అప్పులు చూస్తే, 202324 ద్రవ్య లోటు రూ.11.8 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

జనవరి 27 నాటికి ప్రభుత్వం రూ.12.93 లక్షల కోట్లు సమీకరించగా, ఇది 202223 అప్పుల అంచనా రూ.14.21 లక్షల కోట్లలో 91 శాతం ఉంది. ఆర్థికమంత్రి సబ్సిడీ బిల్లులో పెంపు నేపథ్యంలో ఆర్థిక లోటు లక్షం 6.4 శాతం కొనసాగించారు. 202324లో అప్పులు, మొత్తం వ్యయం రూ.27.2 లక్షల కోట్లు, రూ.45 లక్షల కోట్ల చొప్పున అంచనా, నికర పన్ను వసూళ్లు రూ.23.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 202324 ఆర్థిక సంవత్సరం జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో ద్రవ్య లోటు 5.9 శాతంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వాటా 58 పైసలు
ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా 58 పైసలు వస్తాయి. ఇది కాకుండా అప్పులు, ఇతర పన్నుల ద్వారా 34 పైసలు వస్తాయి. సాధారణ బడ్జెట్ 2023-24 ప్రకారం, డిజిన్వెస్ట్‌మెంట్ వంటి పన్నుయేతర ఆదాయం నుండి 6 పైసలు, రుణేతర మూలధన వసూళ్ల నుండి 2 పైసలు వస్తాయి. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ ప్రకారం, జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) ప్రభుత్వ ఆదాయానికి ప్రతి రూపాయికి 17 పైసలు జమ చేస్తుంది. ఇది కాకుండా కార్పొరేట్ పన్ను నుండి 15 పైసలు అందుతాయి.

ప్రతి రూపాయికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం నుండి 7 పైసలు, కస్టమ్స్ సుంకం నుండి 7 పైసలు పొందుతుంది. ఆదాయపు పన్ను నుండి 15 పైసలు వస్తుంది. ప్రభుత్వ వ్యయం విషయానికొస్తే, తీసుకున్న రుణంపై వడ్డీయే ఎక్కువ భాగం ఉంటుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయికి ప్రభుత్వం 20 పైసలు వడ్డీకి ఖర్చు చేస్తుంది. దీని తర్వాత పన్నులు, సుంకాలలో రాష్ట్రాల వాటా 18 పైసలు ఉంది. రక్షణ కోసం 8 పైసలు కేటాయించారు. కేంద్ర రంగ పథకాలపై ప్రతి రూపాయికి 17 పైసలు ఖర్చు చేయగా, కేంద్ర పథకాలకు 9 పైసలు కేటాయించారు. సబ్సిడీ, పెన్షన్ వరుసగా 9 పైసలు, 4 పైసలు ఖర్చు అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News