Tuesday, November 19, 2024

సిఎస్‌ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్

- Advertisement -
- Advertisement -
Estonian Ambassador Meets CS Somesh Kumar
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి వివరించిన సోమేష్‌కుమార్

హైదరాబాద్: ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియోలు శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్‌కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్ట్, డిజిటలైజేషన్, ఈ -గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సిఎస్ వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా డెలిగేట్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Estonian Ambassador Meets CS Somesh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News