Sunday, January 19, 2025

చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో కొత్త కోణం… మేనమామ హత్య

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: భూమి అమ్మడం లేదని 20 రోజుల క్రితం ఈశ్వరమ్మ మామ నాగన్నను హత్య చేసిన విషయం ఇవాళ వెలుగులోకి వచ్చింది. చెంచుల భూముల పై కొంత మంది గ్రామస్థులు కన్నేశారు. ఈ నెల 3న ఈశ్వరమ్మ చిన్నమామ కాట్రాజు నాగన్న (56)కు చెందిన 2.5 ఎకరాల భూమిని బండి వెంకటేష్ ఎకరా రూ. 20 లక్షలు పలుకుతుండగా రూ. 4.5 లక్షల చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అందుకు నాగన్న ఒప్పుకోకపోవడంతో గ్రామ శివారులో అతడిని హత్య చేశారు. శవ పరీక్ష నిర్వహించకుండానే అంత్యక్రియలు చేశారు. భూతగాదా నేపథ్యంలో నాగన్నను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు నాగన్న హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమెపై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

నాగర్ కర్నూల్ – కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో బాధితురాలు చెంచు మహిళ ఈశ్వరమ్మ, భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేశ్‌ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా తన దగ్గరే ఈదన్న, బాధితురాలు ఈశ్వరమ్మ పని చేసేవారు. ఈశ్వరమ్మ పనికి రావడంలేదని ఆమె మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈశ్వరమ్మ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిమ్స్ లో ఈశ్వరమ్మను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News