Saturday, October 5, 2024

ఎలాంటి భద్రత లేకుండా మూసీ ప్రాంతానికి వెళదాం:ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు. ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట…. ఇలా ఎక్కడకు రమ్మని సీఎం చెప్పినా తాను సిద్ధమన్నారు. హరీశ్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడుతానని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి భద్రత లేకుండా మూసీ పరీవాహక ప్రజల వద్దకు వెళదామా? అని నిలదీశారు. నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం. శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను.

బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను. చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవు. బై డిఫాల్ట్ సీఎం అయ్యావన్నారు. మేము బరిగేసి కొట్లడిన నాడు నువ్వు ఆంధ్రపాలకుల సంకలో ఉన్నావు. నేను కానీ, మా పార్టీ గాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు. చెరువులు బాగుచేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సకరంగా మాట్లాడుతున్నారు. పిట్టల దొరలా మాట్లాడుతున్నారు. సిఎంలాగా కాకుండా బ్రోకర్ లా మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారని, తాను కాదన్నారు. కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టి సన్నాసులు, పిచ్చికుక్కలు కరిచిపోతారని మాట్లాడుతున్నారని, బతకొచ్చిన వాడు అని మాట్లాడుతున్నారన్నారు. చదువుకుంటే సంస్కారం వచ్చేది..ఇతరులు చెప్పేది వింటే జ్ఞానం వస్తుండే. నేను చదువుకుంది కేశవ్ మెమోరియల్ స్కూల్, నా జూనియర్ కాలేజీ అలియా జూనియర్, గన్‌ఫౌండ్రీ. డిగ్రీ కాలేజీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ, నా బిజినెస్ అంతా ఇక్కడే. నన్ను పట్టుకుని బతుకొచ్చుకొనేవాడు అంటున్నాడు. నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గు పడుతుంది.

నీవు ఎంఎల్‌ఏ గా 5 ఏళ్లు ప్రజల మధ్యలో ఉంది సర్వీస్ చేశావా? మల్కాజిగిరి ప్రజలు నిన్ను గెలిపిస్తే మొఖం చూడకుండా మోసం చేశావు. ఒక్కనాడన్నా నిలబడి పని చేయదు. మంత్రిగా పనిచేసి ఉంటే సిస్టమ్ తెలిసేది. అబద్దాల పునాల మీద బ్రతికారు. బ్రోకర్ మాటల మీద బ్రతుకుతావు తప్ప ప్రజలకు సేవ చేయలేదని ప్రజలే అంటున్నారన్నారు. తాను కానీ తమ పార్టీ గాని అభివృద్ధికి, మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదన్నారు. చెరువులు బాగుచేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదని, పేదలకు ఇల్లు కట్టించడానికి, మూసి ప్రక్షాళనకు, చెరువులను కొబ్బరినీళ్ళ లెక్క చేస్తానన్న వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మహిళా పాలసీలో ఆర్టీసీలో ఉచిత బస్సు తప్ప 2500 ఇవ్వలేదని, తులం బంగారం, 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. రుణమాఫీ చేయలేదని, 500 రూపాయల బోనస్, 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, 18 వేల రైతు భరోసా, కౌలురైతులకు డబ్బులు, రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఏది కూడా ఇవ్వలేదని విమర్శించారు. మంత్రులు మాట్లాడే భాషలు రాజకీయ నాయకులుగా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చారు. సంస్కారమతంగా దేవుడు ఎరుగు చాలా వినకూడని సిగ్గుపడే భాష ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News