నేషనల్ హెరాల్ కేసు ఇప్పటిది కాదని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే కాంగ్రెస్ నేతలు, దేశాన్ని పాలించామని చెప్పే వాళ్లు ఎందుకు చట్టాన్ని గౌరవించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిఆరెస్ దేశ ఐక్యత కోరుకుంటారా, విచ్ఛిన్నం కోరుకుంటారా, అనేది ఈ నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. పార్టీల కార్పొరేటర్లు మాత్రం ఆత్మ ప్రభోదం ప్రకారం ఓటు వేయాలని ఆయన కోరారు. – శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాక్ పోలింగ్‌లో అందరూ కరెక్ట్‌గా ఓట్లు వేశారని,
రేపు ఎన్నికల్లో కూడా ఇలానే ఓటు వేయాలని కోరారు. గ్రేటర్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఓట్లలో ఎంఐఎం తర్వాత రెండవ స్థానంలో బీజేపీ ఉందని, మూడో స్థానంలో టిఆర్‌ఎస్, నాలుగు స్థానంలో కాంగ్రెస్ ఉందని తెలిపారు. అతి తక్కువ కాలంలో ప్రజలచేత ఛీ కొట్టించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. చట్టం ఇచ్చిన జడ్జిమెంట్‌ను ఎందుకు కాదంటున్నారో సమాధానం చెప్పాలని కోరారు. భాష మీద నియంత్రణ లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఇక మీకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. కెసిఆర్ కూడా గతంలో ఇదే భాష మాట్లాడారని, ఆయనకు ఏం గతి పట్టిందో చూశామని తెలిపారు.