Monday, December 23, 2024

రేవంత్.. నీకు నాకు పోలిక ఎంటి : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. నీకు నాకు పోలిక ఎంటి.. నీ చరిత్ర ఎంటి, నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సూటిగా అడుగుతున్నా.. మీరు ఏ ఉద్యమంలో జైలుకు పోయారు. నీకు నాకు పోలిక ఎంటి అని ప్రశ్నించారు. నేను నా జీవితంలో ఆర్‌టిఎ ద్వారా ఒక్క దరఖాస్తు పెట్టలేదు. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ధర్నా చేయ్యలేదు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకో.. అని హెచ్చరించారు.

Also Read: మంథనిలో వేడెక్కుతున్న రాజకీయం

మొన్న జరిగిన ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. జాతీయ పార్టీల నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. రాజకీయ నాయకుడు కన్నీళ్లు పెట్టరు. రేవంత్ ఏడుస్తూ కూడా సంస్కారం లేకుండా నీ అమ్మ, నీ అబ్బ అని మాట్లాడారు. నా మీద విమర్శ చేస్తే నీవే పలచబడతావు. ఉద్యమంలో నేను కరీంనగర్, మహబూబ్ నగర్ జైల్లో ఉన్న. నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించారు. మీరు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. రాష్ట్ర నేతలతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటాం అన్నారు.

ఇవన్నీ తెలిసి రేవంత్‌రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయని ఏడ్చాడు కావచ్చుఅని వ్యాఖ్యనించారు. నాకు ధైర్యం ఉంది. ఆత్మ విశ్వాసం ఉంది. ప్రమాణాలు చేసే సంస్కృతి నాది కాదు. నాకు ఫోన్లు చేసి తిట్టిపోస్తున్నరు. ఇదేనా మీ సంస్కృతి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకో.. అని రేవంత్‌ను హెచ్చరించారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News