మనతెలంగాణ/జమ్మికుంట: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు భాజపా రాజీనామా చేశారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భాజపా జనగర్జన సభ జరుగుతుండగానే హుజురాబాద్ నియోజకవర్గంలోని 5మండలాలకు చెందిన నాయకులు పెద్దసంఖ్యలో పార్టీకి రాజీనామాలు చేయడం చర్చంశనీయంగా మారింది.
మలిదశ తెలంగాణ ఉధ్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన పోరాటంలో ఈటల రాజేందర్ నాయకత్వంలో క్రియశీలకంగా పనిచేసిన విద్యార్థి సంఘాల నాయకులు, ఈటల రాజేందర్ బారాస పార్టీని వదిలి భాజపాలో చేరడంతో ఆయనతోపాటు వారు పార్టీ మారారు. ఈటల రాజేందర్‌పై ఉన్న నమ్మకంతో ఆయన వెంట ప్రయాణించి నాయకులు రాష్ట్రంలో, నియోజకవర్గంలో భాజపాకు ప్రజాదరణ లేకపోవడంతో, పాటు ప్రజాభిష్టం మేరకు ఈటల రాజేందర్ పనిచేయకపోవడంతో విరక్తి చెందిన నాయకులు భాజపాను వదిలినట్లు చర్చ జరుగుతుంది.
భాజపా పార్టీని వదిలిన నాయకులు జవ్వాజి కుమార్, మహ్మద్‌జానీ, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు భాజపా పార్టీ నాయకులు, ప్రభుత్వం పనిచేయకపోవడం, ప్రజలకు భాజపాపై నమ్మకం లేదని, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని ఆలోచనతో పార్టీకి దూరంకావడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి సమక్షంలో త్వరలోనే ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన 100మంది ప్రధాన నాయకులు భాజపాను వదిలిన నాయకులు ఉన్నారు.