Monday, December 23, 2024

కానిస్టేబుల్ వేధింపులు?… మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ మహిళ తనపై దాడి చేసిందని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఈటాహ జిల్లాలో జరిగింది. పుటాన్ సాక్రౌలి గ్రామంలో మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్థులు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. బాధితురాలు అత్త తెలిపిన వివరాల ప్రకారం…. పుటాన్ సాక్రౌలి గ్రామంలో స్వప్న అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. స్వప్నకు సీతా దేవి అనే అత్త ఉంది. సీతా దేవి సోదరుడికి ఇసుక అవసరం ఉండడంతో స్వప్న తన ట్రాక్టర్‌లో ఇసుక తీసుకెళ్తుండగా పోలీస్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. వదిలి పెట్టాలని స్వప్న కానిస్టేబుల్‌ను అడిగింది.

Also Read: ఆగస్టు నుంచి సిద్దిపేటలో రైలు సర్వీసుల ప్రారంభం

దీంతో ఇద్దరు మధ్య గొడవ పెరగడంతో ఆమెను పట్టుకున్నాడు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో స్వప్న తగ్గటానికి ప్రయత్నించింది. తన కోడలు బ్లౌజును స్వప్న పట్టుకోవడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను శారీరకంగా, మానసికంగా కానిస్టేబుల్ వేధించాడు. ఆమె ఇల్లును చిందరవందర చేశాడు. దీంతో ఆమె వెంటనే ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు తాహాసిల్దార్ ఆఫీస్ ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. బిజెపి జిల్లా మాజీ అధ్యక్షడు అక్కడికి చేరుకొని ధర్నాకు మద్దతు పలికాడు. ఎస్‌పి కపిల్ దేవ్ సింగ్ అక్కడికి చేరుకొని సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News