Sunday, January 19, 2025

ఇంట్లోకి చొరబడి భార్య ముందే భర్త గొంతు కోశారు…

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్యను చేతులు, కాళ్లను కట్టేసి భర్త గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఈత్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… గోప్చాయ్ గ్రామంలో మనోజ్ జాతవ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి భార్య కాళ్లు, చేతులు కట్టేసి అనంతరం భర్త గొంతు కోసి పారిపోయారు. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఎస్‌పి సంజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఈత్వాల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News