Monday, January 20, 2025

కాంగ్రెస్, బిజెపి మధ్య మునుగోడు మంటలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి మధ్య మునుగోడు మంటలు చెలరేగాయి. కాంగ్రెస్‌కు, బిఆర్‌ఎస్ డబ్బులు పంపించిందంటూ బిజెపి ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు రూ.25 కోట్లు ఇచ్చారనేది జగమెరిగిన సత్యం అని ఈటల స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తరువాయి 12లో
సైతం తనదైన శైలిలో స్పందించారు. బిఆర్‌ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని, ఈటల కూడా చేయాలన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వస్తా నని, ఈటల కూడా రావాలన్నారు. ఒకవేళ భాగ్యలక్ష్మి ఆలయంపై వారికి విశ్వాసం లేకపోతే ఏ ఆలయంలోకైనా వస్తానని, తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పారు. తాను ప్రమాణం చేస్తానన్నది ఈటల రాజేందర్ కోసం కాదని, తెలంగాణ భవిష్యత్ కోసమేనన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఈటల రాజేందర్ చేసిన ఆరోప ణలను తీవ్రంగా ఖండించారు. బిఆర్‌ఎస్ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. సాయం అందించిన వారిలో ఎక్కువగా బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టీలే ఉన్నారని పేర్కొన్నారు. ఈటల దిగజారి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎఐసిసి కార్యదర్శులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కల సమక్షంలో పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల నుంచి తానే డబ్బు సేకరించానని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి డబ్బు వచ్చిందన్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఈటల దిగజారి మాట్లాడటం సహేతుకమన్పించుకోదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News