Sunday, January 19, 2025

కేంద్రం వంద లక్షల కోట్ల అప్పు ప్రచారం అవాస్తవం: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వంద లక్షల కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ అన్నారు. మాటలు కోతలు ఎన్నైనా కోయవచ్చు కానీ ప్రతి విమర్శకు లెక్క ఉండాలన్నారు. ప్రభుత్వాలు అప్పులను పద్దతి ప్రకారం చేస్తాయని తెలిపారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. అనేక రాష్ట్రాలు ఎన్నికల సంవత్సరంలో ఓట్లే లక్షంగా బడ్జెట్ పెడుతుంటాయని, ప్రధాని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రలోభ పెట్టే బడ్జెట్‌ను పెట్టలేదని సమర్థించారు.

కేంద్ర బడ్జెట్‌లో మాయలు, మభ్యలు ఉండవని ప్రాక్టికల్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాలుగు శాతం ఉన్న ద్రవ్యోల్భణం కరోనా కాలంలో 9.5 శాతానికి పెరిగిందని, ఇప్పుడు దాన్ని 6.2 శాతానికి తెచ్చారని అన్నారు. మళ్ళీ దాన్ని 4 శాతానికి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ఈటల వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News