Sunday, January 19, 2025

నామినేషన్ వేసిన అరుణ, ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి డికె అరుణ, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అరుణ నామివేషన్ వేశారు. డికె అరుణ్ నామినేసన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బిజెపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ లో ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నాలుగో విడత ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో మే 17న 17లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News