Tuesday, January 21, 2025

రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారంలోని ఏకశిలనగర్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటల చేయి చేసుకున్నారు. పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్ పై దాడి చేశారు. బాధితులు, స్థానికులు కూడా బ్రోకర్ ను చితకబాదారు. ఏకశిలనగర్‌లో రియల్ వ్యాపారులు తమ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని బాధితులు ఎంపి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈటల రాజేందర్ ఏకశిలనగర్ వెళ్లి రియల్టర్లను మందలించారు. ఆగ్రహంతో రియటర్లపై ఈటల చేయి చేసుకున్నారు. పేదల భూములు కబ్జా చేస్తే తాటా తీస్తానని హెచ్చరించారు.

పేదల భూములను రియల్ వ్యాపారులు దౌర్జన్యంగా హస్తగతం చేసుకుంటున్నారని, ఇది నేరమని, రియల్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 1985లో నారపల్లి, కొర్రెముల ప్రాంతాలలో పేదల కష్టపడి భూములు కొనుగులు చేశారని, ఆ భూములను రియల్ వ్యాపారులు కబ్జా చేశారని దుయ్యబట్టారు. పేదలకు బిజెపి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదల భూములను కాపాడటం తన బాధ్యత అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆ భూములపై దొంగ పత్రాలు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని అనుకున్నామని, కలెక్టర్లు, పోలీసులు పేదల సమస్యలు పట్టించుకోకుండా రియల్ వ్యాపారులకు సహాయసహకాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News