Monday, December 23, 2024

పేపర్ లీక్.. నన్ను ఇరికించాలని సిఎం కెసిఆర్ కుట్ర పన్నారుః ఈటెల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ డిసిపి కార్యాలయంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కమలాపుర్‌లో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో సోమవారం ఈటల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడతూ.. ”హిందీ పేపర్ లీక్ ఘటనపై విచారణకు పిలిచారు.ప్రశాంత్ నుంచి నాకు వాట్సప్ కాల్ వచ్చిందని ఆరోపించారు. నా సెల్ ఫోన్ తీసుకుని డిసిపి వద్దకు విచారణకు హాజరయ్యాను. నా సమక్షంలో అధికారులు సెల్ ఫోన్ పరిశీలించారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని నిర్ధారించుకున్నారు.

నా సెల్ ఫోన్‌కు మహేశ్ మెసేజ్ పంపారు. ఇతరులకు నేను మెసేజ పంపలేదని నిర్ధారించుకున్నారు. పేపర్ లీక మాట పచ్చి అబద్ధం.. ఇది మాల్ ప్రాక్టీస్. నన్ను ఇరికించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుట్ర పన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టాలని చూస్తున్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా కెసిఆర్, ధనిక పార్టీగా బిఆర్‌ఎస్ నిలిచింది. ఎనిమిదేళ్లలో రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. కాంట్రాక్టులు, ఇసుక, మద్యం దందాలతో దోపిడి చేశారు” అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News