Sunday, December 22, 2024

కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ప్రయత్నాలు:ఈటెల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉండి మధ్యంతర బెయిల్‌పై మంగళవారం విడుదలైయ్యారు. తన అరెస్ట్ కారణంతో తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదని ఇటీవలే ప్రకటించారు. దీంతో టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ స్పందిస్తూ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌కు బలం పెంచేందుకు ఎత్తులు వేస్తున్నారని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారని, ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు తెరవెనుక నుంచి చంద్రబాబు మంత్రాంగం నడుపుతున్నారని విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News