Monday, December 23, 2024

ఆ ఘనత కేసీఆర్‌దే: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను టాక్స్ ఫోర్స్ పోలీసు వాళ్లు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలో జరిగిందని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి జడ్జి ఆశ్చర్యపోయారని ఈటల వెల్లడించారు. కేయూ విద్యార్థులను వీసీ కొట్టించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టించిన ఘనత కేసిఆర్ సర్కార్ దేనని ఈటల వెల్లడించారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News