Friday, January 24, 2025

ఎన్నికల ముందో.. తరువాతో కాంగ్రెస్.. బిఆర్ఎస్ కలుస్తాయి: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ పదే పదే విషాన్ని చిమ్ముతోందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సింగరేణిని అమ్మడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో చెప్పారని ఈటల పేర్కొన్నారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన వెల్లడించారు. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారన్న బిఆర్ఎస్ ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బొగ్గు గనులకు దరఖాస్తు చేసుకోకుండా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకని ఈటల ప్రశ్నించారు. సింగరేణిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో 3 గనులు ప్రేవేట్ కి ఇచ్చి తవ్విస్తున్నది నిజం కాదా? అని ఈటల ప్రశ్నించారు. రూ. 20 కోట్ల బకాయిలు సింగరేణికి ఎందుకివ్వడం లేదో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.

విశాఖ గురించి ఆలోచిస్తున్న కెసిఆర్… ఆర్టీసీకి న్యాయం చేయాలి, విశాఖ గురించి ఆలోచిస్తున్న కెసిఆర్ రాష్ట్ర్రానికి న్యాయం చేయాలి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ రూ. 25కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు అన్నారు. ఎన్నికల ముందో.. తరువాతో కాంగ్రెస్, బిఆర్ఎస్ కలుస్తాయని ఈటల జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News