Monday, December 23, 2024

కెసిఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ గడ్డ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిందని ఈటల ఆరోపించారు. ప్రజల సొమ్మతో దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రైతు వేదికలు ఎందుకూ పనికి రాకుండా పోయాయన్నారు. పండిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ రైతులకు ఎం మేలు చేసిందో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే దుబ్బాక ఎంఎల్ఏ రఘునందన్ రావు రింగ్ రోడ్డుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News