Thursday, December 19, 2024

బుచ్చమ్మ మృతి..హైడ్రా చేసిన హత్యే: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి నల్లచెరువు హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇది హైడ్రా చేసిన హత్యేనని, ఇకనైనా ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఆపాలని ఈటల డిమాండ్ చేశారు. ’హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య’ అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆయన హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన బుచ్చమ్మ మరణం తీవ్రంగా బాధిస్తుందని, దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని అన్నారు. వారి ఉసురు ఊరికే పోదని, అనాలోచిత నిర్ణయాలు, అడ్డగోలు కూల్చివేతలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లచెరువు దగ్గర వారికి ఉన్నది పట్టా భూమి అని, కష్టపడి ఇళ్లు కట్టి కూతుళ్లకు కట్నం కింద ఇచ్చుకున్నారని తెలిపారు. ఆ ఇళ్లు కూలగొడతామని అధికారులు బెదిరించడంతో ఆమె తనువు చాలించిందని అన్నారు. ఇది హైడ్రా చేసిన హత్యేనని మండిపడ్డారు. ఇక నల్లచెరువు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు బుచ్చమ్మ ఆమె కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చి భోరున ఏడ్చారని పేర్కొన్నారు. బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేగాక హైడ్రా పేరిట ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసం ఇకనైనా ఆపాలని ఈటల హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News