Tuesday, December 24, 2024

ఓటమితో నాలో కసి పెరిగింది: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గంలో బిజెపి ముఖ్య కార్యకర్తలతో మాజీ బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ గురువారం భేటీ అయ్యారు. గజ్వేల్ లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కెసిఆర్ గెలిచారని ఆరోపించారు. గజ్వేల్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని చెప్పారు. గజ్వేల్ లో నైతికంగా బిజెపి గెలిచినట్లేనని తెలిపారు. కెసిఆర్.. ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదన్న ఈటల స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కెసిఆర్ గెలిచారని చెప్పుకొచ్చారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు ఓటమి తెలియదని ఈటల గజ్వేల్ లో ఓటమితో నాలో ఇంకా కసి పెరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News