Wednesday, January 22, 2025

ప్రైవేట్ తో విద్యావ్యవస్థ నిర్వీర్యం : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యా వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మేధావుల సదస్సును మాజీ డిజిపి కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో ఈటల మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఆత్మగౌరవం కోల్పోయారని అన్నారు. ‘ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చారు.

పేదవాడికి విశ్వవిద్యాలయం విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది పోలీసు శాఖలోనే. పోలీసులు అవినీతి పరులకు రక్షణగా నిలిచారని ఆరోపించారు. వ్యాపారవేత్తలకు చౌకగా భూములు కట్టబెట్టేందుకు ధరణి తీసుకొచ్చారు. దళితులకు మూడెకరాల భూమి దేవుడెరుగు..ఉన్న భూములు గుంజుకున్నారు. ప్రతి తెలంగాణ బిడ్డపై కెసిఆర్ అప్పు మోపారు. మేధావులు, విద్యావేత్తలు. వివిధ సంఘాల నేతలతో మేధోమథనం జరిగింది. వచ్చే నెల 6న ప్రజా సమస్యల సమాచారాన్ని బుక్ లెట్ రూపంలో తీసుకొచ్చి బహిరంగ సభలో ప్రజలకు పంపిణీ చేస్తాం‘ అని ఈటల రాజేందర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 74 వేల కోట్ల అప్పు ఉంటే.. నేడు 5 లక్షల కోట్ల అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ మీద 1లక్ష 20 వేల అప్పు ఉందన్నారు.ఈ సదస్సులో విశ్రాంత చీఫ్ జస్టిస్ నరసింహరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపిఎస్ అధికారి అరవింద్‌రావు, అధ్యాపకుల ఫోరం పేరాల శేఖర్, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్స్ సభ్యులు తుర్క నరసింహ, అశ్వద్ధమరెడ్డి, టిఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్, ప్రొఫెసర్ హుస్సేన్ నాయక్, మురళీ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, డాక్టర్ సి ఎల్ వెంకట్ రావు, రెవెన్యూ నిపుణులు లచ్చిరెడ్డి, భూమి సునీల్, తెలంగాణ విఠల్, ఇరిగేషన్ మాజీ ఏక్సిక్యూటివ్ ఇంజనీర్ విఠల్ రావు, రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేన రెడ్డి, దామోదర్ రెడ్డి, చంద్రమౌళి, వెంకటేశ్వర రావు, పారిశ్రామిక వేత్త సుధాకర్ గాండే, రిటైర్డ్ పోలీసు అధికారులు అంజయ్య, సుంకరి సత్యనారాయణ, ఓయు విద్యార్ధి నాయకులు ఆంజనేయులు, నెహ్రూనాయక్, జాన్,వంశీ, నరేష్, ప్రజ్ఞ భారతి నుంచి బి.ఎస్.శర్మ, సునీల్ మాదిగ, గడ్డం సాయి, కాళోజీ టివి ఎండి దాసరి శ్రీనివాస్, సినిమా రంగం నుంచి వైభవ్, అనలిస్ట్ సూరేపల్లి శ్రీనివాస్, బిసి సమాజ్ అధ్యక్షులు సూర్యరావు, వివిద కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News