Monday, December 23, 2024

మెడికల్ కాలేజీల్లో లోలోపల ర్యాగింగ్ జరుగుతోంది: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో ఇంకా లోలోపల ర్యాగింగ్ జరుగుతుందని ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలలో ఏమి జరుగుతుందో తెలియడానికి ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమేనని అన్నారు. మెడికల్ కాలేజీలలో ర్యాగింగ్ లేదని చెబుతున్నా అంతర్లీనంగా ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి, ఆమె కుటుంబ సభ్యులను ఎంఎల్‌ఎ ఈటల పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికో ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై వేధింపులు జరుగుతున్నాయని పోలీసులకు బాధితురాలు ప్రీతి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉందని ఆయన ఆరోపించారు. ప్రీతిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News