Friday, November 8, 2024

‘మన ఊరు-మన బడి’ ఒక రంగుల కల: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేక్తం చేశారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ”బడ్జెట్ లో విద్యా రంగానికి సరైన కేటాయింపులు చేయలేదు.

మన ఊరు-మన బడి ఒక రంగుల కల. ఆరోగ్య శ్రీ డబ్బులను ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం చేయలేమని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లకు రెండేళ్లకు, మూడేళ్లకు కూడా డబ్బులు రావడం లేదు. దీంతో తెలంగాణలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా లేవు” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News