Monday, January 20, 2025

రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈటెల దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈటెల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్న మాట్లాడుతూ… అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లకుండా ఉండటానికే ఈటెల రాజేందర్ సిఎం కెసిఆర్ కు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటెలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్, జినుకల కనకయ్య, గుండు శ్రీను, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రశాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, నాయకులు అవిశెట్టి కిరణ్, కాశమేని మహేందర్, ఎండి.జానీ, కందుకూరి మురళి, బొమ్మగాని ఉప్పలయ్య, బోనగిరి సతీష్, నోముల రమేష్, అన్నెపు వెంకన్న, మల్లెబోయిన నర్సింహ, అన్నెపు నర్సింహ, పాలోజు శేఖరాచారి, అన్నందాసు మహేందర్, హరీష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News