Monday, December 23, 2024

బిజెపితోనే సమర్థ పాలన : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి నీతి లేదు, జాతి లేదు. అధికారం తప్ప.. సిద్దాంతం లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సెడెం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి రాజ్‌కుమార్ పాటిల్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే విధంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానితో కలిసి సులేపేట్‌లో కోలి సమాజ్ సమావేశంలో ప్రసంగించారు. కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయతో కలిసి చించోలీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అవినాష్ జాదేవ్ తరపున ఎన్నికల ప్రచారం ఈటల రాజేందర్ నిర్వహించారు.

Also Read: స్మగ్లింగ్ సిగరెట్లను పట్టుకున్న ఆర్‌పిఎఫ్ అధికారులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలి విలువ తెలిసిన వాడు కాబట్టే ప్రధాని మోడీ ఆకలికి పరిష్కారం చూపిస్తున్నారు. నాడు వేరే దేశాల మీద ఆధారపడ్డ భారత్ ఇప్పుడు స్వయం ప్రతిపత్తి సాధించిందన్నారు. కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా గెలిచేది బిజెపియే అన్నారు. వ్యవసాయం సరిగా లేక కందులు, జొన్నలకే పరిమితం అయిన రైతులకు.. కాగ్నా నది మీద చెక్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News