Thursday, January 23, 2025

మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇన్‌చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి వంశీ తిలక్, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు బాషా, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డిలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు ఈటల రాజేందర్ శామీర్‌పేటలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News