Monday, December 23, 2024

రాజకీయ దురాశతో బిఆర్‌ఎస్ ఏకాకి: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజకీయ దురాశ… బిఆర్‌ఎస్ పార్టీని ఏకాకిని చేసిందని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాజకీయ శక్తుల్ని కూడగట్టేందుకు విమానాల్లో తిరిగి కెసిఆర్ అభాసుపాలయ్యాడు. రాజకీయ పార్టీలకు బిఆర్‌ఎస్ డొల్లతనం తెలిసిపోయింది. మిడిసిపాటుతో రాజకీయ పక్షాల తిరస్కరణకు గురయ్యారని విమర్శించారు.

రాష్ట్రంలో పాలన చేసే సత్తా లేదు కానీ.. కూట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తియ్యడానికి పోయినట్టు.. విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి పోయారు. నన్ను నాయకున్ని చేయండి దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేస్తా అని చెప్పి వచ్చారు. అయినా బిఆర్‌ఎస్‌ను ఎవరు నమ్మడం లేదన్నారు. అటు బిజెపి కూటమి,ఇటు కాంగ్రెస్ కూటమి నమ్మక ఎటు కాకుండా పోయారు. రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News