దమ్ముంటే రాజీనామా చెయ్
ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా
మాజీ మంత్రి ఈటలకు మంత్రి గంగుల సవాల్
‘బిడ్డా గంగుల’ గుర్తుపెట్టుకో అంటూ ఈటల వార్నింగ్
2023 తరువాత అధికారంలో ఉండవని జోస్యం
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్‌లో మరోసారి రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ నడుమ మాటలయుద్ధం మరింత ముదిరింది. తొలుత మంగళవారం ఉదయం ఈటల హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ గంగుల కమలాకర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘బిడ్డా.. గంగుల కమలాకర్ అధికారం ఎప్పటికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. 2023 తర్వాత నువ్వు అధికారంలో ఉండవు అని జోష్యం చెప్పారు. కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందల గడ్డగా మార్చావని మండిపడ్డారు. నీకు మంత్రి పదవీ పైరవీ వల్ల వచ్చింద ని గంగులను ఉద్దేశించి అన్నారు. అధికారం అనేది ఎప్పటికీ శా శ్వతం కాదు బిడ్డా.. హుజురాబాద్ ప్రజలను వేధిస్తున్నావ్ అంటూ గంగులపై ఈటల ఘూటు వ్యా ఖ్యాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికే మంత్రి గం గుల ఇక్కడి క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముం టే ఈటల ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి అని సవాల్ విసిరారు. ఎవరేంటో అక్కడే తేలిపోతుందన్నారు. తన ను ఉద్దేశించి బిడ్డా.. అని వ్యా ఖ్యానించిన ఈటలపై మంత్రి మండిపడ్డారు. నేను కూడా అంతక న్నా ఎక్కువే మాట్లాడగలలని, తాను కూడా ఓ బిసి బిడ్డనేనని అన్నారు. ఆత్మగౌరవం అనే మా టాకు అర్థం తెలిస్తే తక్షణమే రాజీనా మా చేయాలన్నారు. హుజురాబాద్ వస్తే ఈటల రాజీనామా చేస్తారని అనుకున్న, రాజీనామా చేయడానికి ఆయన భయపడుతున్నారని మండిపడ్డారు. ఈటల మొహంలో భయం కనపడుతోంద్ననారు. తప్పు చేశాననే భావన ఆయనలో ఉందని చూస్తేనే తెలుస్తుందని గంగుల వ్యాఖ్యానించారు. ఒక్క హుజురాబాద్‌లో 30క్వారీలు తమిళనాడు వాసులు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదని, వాళ్లతో కుమ్మక్కయ్యింది నిజమా, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ బొందల గడ్డ అవుతుంటే మంత్రిగా ఉన్నప్పుడు చూసి కూడా ఎందుకు ఆపలేకపోయావో చెప్పాలన్నారు. ఈటల అక్రమాస్తుల్ని ప్రతికా ముఖంగా ఆయనే ఓప్పుకున్నారని గంగుల గుర్తు చేశారు. అడ్డగోలు మాటలు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఈటల దెబ్బతీయాలని చూస్తే ఊరుకోమని దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధ్ది, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో 90 శాతం ప్రజలు తెరాస వైపు ఉంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
Etela Rajender fires on Minister Gangula Kamalakar