Wednesday, January 22, 2025

హుజూరాబాద్‌కు ఓ సైకోను ఎమ్మెల్సీగా పెట్టారు: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అరాచకాలు ఎక్కువయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ”కౌశిక్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. హుజూరాబాద్‌కు ఓ సైకోను ఎమ్మెల్సీగా పెట్టారు. మా కార్యకర్తలనే కొట్టి కేసులు పెడ్డుతున్నాడు. ఈ సైకోను వెంటనే పదవి నుంచి తొలగించాలి. మా ఓపిక నశించిన రోజు సైకోకు చెప్పుల దండ వేసి తిప్పుతాం. నాలాంటి వ్యక్తులను చంపేందుకు సుఫారి ఇచ్చేంత వరకు వచ్చింది. ఈ సైకో వల్ల బిఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు” అని పేర్కొన్నారు.

కాగా, ఈటల రాజేందర్ ను పాడి కౌశిక్ రెడ్డి హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఈటల భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దీనిపై స్పందించిన మంత్రి కెటిఆర్.. ఈటల రాజేందర్ భద్రతపై డిజిపికి ఫోన్ చేసి విచారణకు ఆదేశించారు.

Also Read: వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడుః జగన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News