Monday, December 23, 2024

రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం : ఈటల

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు.

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టిఆర్‌ఎస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌లో కెసిఆర్‌పై పోటీ చేయడం ఖాయం అని ఈటల అన్నారు. టిఆర్‌ఎస్ ఓడించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు చెప్పారన్నారు. రాజగోపాల్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు.

మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు టిఆర్‌ఎస్ సర్కార్‌పై విశ్వాసం కోల్పో యారని విమర్శించారు. వారంతా ఇష్టంలేని కాపురం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. అందుకే నియోజక వర్గాల్లో పనుల కోసమే వారు టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారని అన్నారు. అనేక మంది టిఆర్‌ఎస్ నేతలు బిజెపితో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలంటే అది బిజెపితోనే సాధ్యం అని చెప్పారు. తెలంగాణలో ఎప్పడూ ఎన్నికలు జరిగిన కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Etela Rajender Invites Rajagopal Reddy into BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News