- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ని ఊసరవెల్లిగా అభివర్ణించారు షబ్బీర్ అలీ. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల పార్టీలు మార్చారని దుయ్యబట్టారు. బిజెపిలో చేరికల కోసం నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.
కోట్లు ఇస్తాం బిజెపిలోకి రావాలంటూ దిగజారి అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. అటు ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, ఈటల మధ్య ఫైట్ గట్టిగనే జరుగుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
- Advertisement -