- Advertisement -
మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హాకింపేట్, అచ్చంపేట గ్రామాలలో ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులు స్పాట్ కు చేరుకొని భూములను పంపిణీ చేయనున్నారు. ఈటల రాజేందర్ హేచరీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో శనివారం విచారణ జరిపిన అధికారులు బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ 66 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్టు నిర్ధారించిన విషయం తెలిసిందే.
ఈటల రాజేందర్ జమున హేచరీస్, ఫౌల్ట్రీఫాంకు సంబంధించిన కబ్జా భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 130 లో గల 15 ఎకరాల 35 గుంటల భూమి, 111 సర్వే నంబర్‌లోని 7 ఎకరాల 15 గుంటల భూమి, 81 సర్వే నంబర్‌లోని 9 ఎకరాల 15 గుంటల భూమి అలాగే 130/5, 130/9, 131, 64/6 భూములకు సంబంధించి 175 ఎకరాల్లో డిజిటల్ సర్వే చేసి గుర్తించారు.
- Advertisement -