Saturday, November 23, 2024

నేడు ఈటల రాజీనామా?

- Advertisement -
- Advertisement -

Etela Rajender surrendered Convoy to TS Govt

మనతెలంగాణ/ఇల్లందకుంట: రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిసిన తరువాత మరో 6 నెలల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తెలంగాణ మంత్రివర్గం నుండి సిఎం కెసిఆర్ బర్త్ రఫ్ చేయడంతో ఈటల తీవ్ర మనస్థాపానికి గురై తన ఎమ్మెల్యే పదవికి, టిఆర్‌ఎస్‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం ఉదయం రాజీనామా చేయనున్నారు.గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న ఈటల రాజేందర్‌ను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కలిశారు. టిఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన తరువాత మరో 6 నెలల్లో హుజురాబాద్‌కు ఉపఎన్నికలు అనివార్యంగా కనబడుతున్నాయి. టిఆర్‌ఎస్ పార్టీ తరుపున ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికింతారావు సతీమణి ఓడితల సరోజన బిసీ కమీషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌తో సహా డజన్‌మంది లీడర్లు హుజురాబాద్ సీటు కోసం పావులు కదుపుతున్నారు.

2004 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు శాసన సభ్యుడిగా 2 సార్లు మంత్రిగా ఎన్నికైన ఈటల రాజేందర్ తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేసి శుక్రవారం బిజెపి పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున రెడ్డి బిజేపి అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్దంగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన పాడి కౌశిక్‌రెడ్డి, ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా హుజురాబాద్ ఎన్నికలపైనే దృష్టి సారించడంతో రాష్ట్ర స్థాయిలో హుజురాబాద్ పేరు మరోసారి మారుమోగనున్నది.

Etela Rajender may be resign his MLA Post on June 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News