Monday, December 23, 2024

జూపల్లి, పొంగులేటితో ఈటల భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి భేటీ అయ్యారు. గురువారం నగర శివారులోని ఈటల రాజేందర్ ఫామ్ హౌస్‌లో వారి సమావేశమయ్యారు. గన్‌మెన్ల్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే వారు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ బలోపేతంతో పాటు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి సన్నాహాలు ముమ్మరం చేస్తోంది.

ఈ సమయంలోనే వీరితో భేటీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి బలమైన అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరితో ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లిన బిజెపి రాష్ట్ర ముఖ్యనేతలు.. ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావుతోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని. ఏ పార్టీలో చేరాలనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమని భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత మరోమారు బిజెపి నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News