Sunday, January 12, 2025

ప్రజా విశ్వాసాలతో చెలగాటం సరికాదు:ఎంపి ఈటల

- Advertisement -
- Advertisement -

ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడం సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఈ ప్రాంత ప్రజలు పట్టుకుని పోలీసులుకు అప్పగిస్తే రోజులు గడిచినా ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరించిందని ఆరోపించారు. బుధవారం కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహంకారపూరితంగా ప్రజల మనోభావాలకు విరుద్ధమైన చర్యలు చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అపవిత్రమైన ఆలయప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఈ ప్రాంతవాసులు అనేక రోజులుగా దీక్షలు పూజలు నిర్వహిస్తుంటే వాటిని నిలువరించే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. దానికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ చెపట్టారని ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ల చూశారని ఆరోపించారు. అనేక మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టారని, చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఈ ఆలయాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేస్తామని చెప్పకతప్పలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News