Thursday, March 27, 2025

బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది:ఎంపి ఈటల

- Advertisement -
- Advertisement -

విద్యా వ్యవస్థను కెసిఆర్ భష్టుపట్టించారని, ఇపుడు అదే తరహాలో కాంగ్రెస్ పయనిస్తోందని, బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వరంగల్ నగరంలోని ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజల తరపున కొట్లాడే పార్టీ బిజెపి అని అన్నారు. ఉపాధ్యాయ ఎంఎల్‌ఎసి ప్రచారం కోసం తాము ఎక్కడికి వెళ్లినా అన్ని మద్దతు ఇస్తున్నారని అన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల గ్రీన్ ఫీల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల అభ్యర్థి పులి సర్వోత్తమ్‌రెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ కొండేటి శ్రీధర్, మాజీ ఎపి సీతారాంనాయక్, మాజీ ఎంఎల్‌ఎ వన్నాల శ్రీరాములు, పార్టీజిల్లా అధ్యక్షుడు గంట రవి, సంతోష్‌రెడ్డి, పూర్వ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీప్రసాద్, వన్నాల వెంకటరమణ, రత్నం సతీష్‌షా, ఎంఎల్‌సి ఎన్నికల జిల్లా కన్వీనర్ బైరి మురళీకృష్ణ, పార్టీ మండలాధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News