Sunday, December 22, 2024

పంట భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వడం దారుణం:ఈటల

- Advertisement -
- Advertisement -

పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతుల నుంచి భూములను వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం వంటిదన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంచే చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కుని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్‌లో భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎటువంటి అర్హతలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు లగచర్లకు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు బిజెపి ఎంపీ డీకే అరుణ వెళితే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి 1500 పోలీసు బలగాలను మోహరించి గ్రామాల మీదపడి ప్రజలను అరెస్టులు చేశారని, ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగిన పాపానికి కొట్టారని మండిపడ్డారు. ఇంటర్నెట్‌ను బంద్ చేసి అరెస్టులు చేశారని, ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి చూపిస్తున్న నిజస్వరూపమే ఇది అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూములు ఉన్నవారు తమ భూమి విలువ రూ.20 కోట్లు నుంచి రూ.30 కోట్లకు పెరిగిందని సంతోష పడుతుంటే భూములు కోల్పోయిన వారు మాత్రం అదే ఎయిర్ పోర్టులో టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే దుస్థితి నెలకొందని అన్నారు. భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊడ్చే ఉద్యోగాలు, తూడ్చే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్‌లో పోలేపల్లె సెజ్ విషయంలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

అధికారులను కూడా చెబుతున్నారని అన్నారు. గతంలో వైఎస్సార్, నిన్నటి వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వాలలో ఏం జరిగిందో చూశామని అన్నారు. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు వస్తే తన్నితరమండని దుర్మార్గంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ మేము వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News