Sunday, December 22, 2024

ముచ్చటగా మూడవసారి మోడీ ప్రధాని కావడం ఖాయం:ఈటల

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సూర్యాపేట జిల్లా, కోదాడ కాశీనాథం ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జహిరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్‌తో కలిసి ఎంఎల్‌సి అభ్యర్థ్ధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ, పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలుస్తారని అన్నారు. తెలంగాణలో బిజెపికి 12కు పైగా ఎంపి స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గత పది ఏళ్ల మోడీ పాలనలో ఎక్కడా అవినీతి లేదని, 75 సంవత్సరాలు నాలుగు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కామ్‌లే జరిగాయని విమర్శించారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రేమేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, మాజీ ఎంఎల్‌సి జనార్దన్‌రెడ్డి, ఎంపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, నూనె సులోచన, కనగాల వెంకటరామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, అంజియాదవ బండారు కవిత, అక్కిరాజు యశ్వంత్, వంగవీటి శ్రీనివాసరావు, శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News