Saturday, November 23, 2024

అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి శ్రేణులపై అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు మానుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్, వార్డ్ మెంబర్ మహ్మద్ ఇబ్రహీంపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని నిరసన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన హుజురాబాద్ సిఐ రమేష్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, పొలీసులు బిఆర్‌ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బిజెపి నాయకులను, కార్యకర్తల పై అక్రమ కేసులతో పోలీసుల వేదింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

నన్ను గెలిపించిన హుజురాబాద్ గడ్డ మీద కక్ష కట్టారు. నాపై కోపంతో మానేరు నదిని చెరబట్టారు. వేల టన్నుల ఇసుక తరలించి ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌లో 3500 కుటుంబాలకు దళితబంధు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మీ చెక్కులు ఇవ్వడం లేదు. రెండేళ్లుగా నియోజకవర్గంలో ఇబ్బందులను భరిస్తూ ఉన్నాను.. నా పంచాయతీ ఇక్కడ కాదు.. నా పంచాయతీ నాలుగు కోట్ల ప్రజలను ఐక్యం చేసే పంచాయతీ అన్నారు. దీక్షలో జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగే శోభ, రావు పద్మ, ప్రదీప్ రావు, రాకేశ్ రెడ్డి,జిల్లా బిజెపి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్‌రావు, కన్వీనర్ మాడ గౌతంరెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News